ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:56 AM
గ్రామాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లోని దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
మహానంది, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లోని దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో రూ.60 లక్షలతో చెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవదాయశాఖ సీజీఎఫ్ నిధులతో గ్రామంలోని పురాతన ఆలయం చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అన్ని రకాల వసతులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ పునః నిర్మాణ నమూన మ్యాప్‌ను ఎమ్మెల్యేకు దేవదాయశాఖ డీఈఈ మెల్లంపూరి శ్రీనివాస ప్రసాద్ చూపించి వివరించారు. దీనికి ఎమ్మెల్యే కొన్ని మార్పులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్వర్ణముఖి, ఎంపీపీ యశస్విని, టీడీపీ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మాజీ ధర్మకర్త మల్లికార్జునరావు, మధు, క్రాంతికుమార్, చిన్న రంగస్వామి, రాముడుగౌడ్ పాల్గొన్నారు.