అన్నప్రసాద వితరణకు విరాళం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:24 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.
శ్రీశైలం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి దాతలు విరాళం ఇచ్చారు. బుధవారం గుంటూరు జిల్లాకు చెందిన ఓబులరెడ్డి రూ.1,00,016 అన్నప్రసాద వితరణకు ఆలయ ఏఈవో సతీష్‌మల్లిక్ మరియు పర్యవేక్షకులు శివప్రసాద్‌లకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, జ్ఞాపికతో పాటు రసీదును అందజేశారు.
൹