పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:31 AM
రీ సర్వే పూర్తి అయిన మనేకుర్తి గ్రామానికి చెందిన రైతులకు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఆలూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే పూర్తి అయిన మనేకుర్తి గ్రామానికి చెందిన రైతులకు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫొటోలతో పాసు పుస్తకాలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరి ఫోటోలు లేకుండా ప్రభుత్వ గుర్తుతో పాసు పుస్తకాలు పంపిణీ చేస్తుందన్నారు. ఆర్‌ఐ బసవన్నగౌడ్, టీడీపీ నాయకులు డీలర్ వెంకటేష్ పాల్గొన్నారు.