Share News

విగ్రహాల ఆవిష్కరణ

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:40 PM

ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అందరికీ ఆదర్శమని విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.

 విగ్రహాల ఆవిష్కరణ
పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

వెల్దుర్తి టౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అందరికీ ఆదర్శమని విగ్రహాల దాత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక బాలికల పాఠశాలలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, హెచ్‌ఎం చంద్రావతి, విద్యాకమిటీ చైర్మన్‌ రాజేశ్‌, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు బాలకృష్ణ, నాగ సురేంద్ర యాదవ్‌, మైనార్టీ నాయకులు అన్వర్‌ హుశేన్‌, పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:40 PM