Share News

జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:53 PM

ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంత పల్లెలు సమగ్ర అభివృద్ది చెందుతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్‌ అన్నారు.

జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి
ఆదోని: మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేశ్‌

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంత పల్లెలు సమగ్ర అభివృద్ది చెందుతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్‌ అన్నారు. పట్టణంలోని భీమాస్‌ కూడలిలో ఆదోని జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు సోమవారం 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో పెద్దతుంబళం మండల బీజేపీ కార్యకర్తలు వేణుగోపాల్‌, రంగనాథ్‌రెడ్డి, విశ్వనాథ్‌, అంగడి వీరేష్‌, నిత్యానంద, పెద్ద కొండయ్య, శివరాముడు, లక్ష్మణ్ణ, లింగయ్య, ఆనందాచారి, నాగరాజు, లింగరాజు, లక్ష్మణ్ణ, ముఖేష్‌, విక్రమ్‌, లక్ష్మీరెడ్డి, నాగరాజు కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్‌, మరియాని చెన్నబసప్ప సంఘీభావం తెలిపారు.

ఆలూరు: ఆదోనిని జిల్లాగా చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ ఆర్టీఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు, సీపీఐ మండల కార్యదర్శి రామాంజి నేయులు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రామాంజినేయులు ఆరోపించారు. సోమవారం పట్టణంలో ఆదోని జిల్లా కోసం జేఏసీ నిర్వహిస్తున్న రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ గౌరవవాధ్యక్షులు హీరాలాల్‌, అధ్యక్షులు బండారు వీరేష్‌, ఉసేన్‌, రాజేష్‌ కన్నా, తరుణ్‌లు కూర్చున్నారు. ఈ దీక్షలకు మార్పు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వేమనరెడ్డి, ఓంశాంతి సంస్థ సభ్యులు బసిరెడ్డి, జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, ఎల్లప్ప, చంద్రకాంత్‌రెడ్డి, చాపల గోపాల్‌ సంఘీభావం తెలిపారు.

పత్తికొండ టౌన్‌: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, పత్తికొండ సర్పంచ్‌ కొమ్ము దీపిక, లోక్‌సత్తా పార్టీ నాయకులు ఆనంద్‌ ఆచారి, మాదాసి, మాదారి కురువ సంఘం నాయకులు రామలింగప్ప, చంద్రశేఖర్‌, లక్ష్మీన్న డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన నాయకులు మాట్లాడుత జిల్లాలో పశ్చిమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు జయరాముడు, తిమ్మప్ప, నాగప్ప, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:53 PM