Share News

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:25 AM

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
నలకదొడ్డి గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

పత్తికొండ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మండలంలోని నలకదొడ్డి గ్రామంలో మండల ప్రత్యేకాధికారి చిన్నఓటులేష్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పల్లెపండుగ- 3.0 కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో నూతనంగా రెండు కాలనీల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి వెల్లి లబ్ధిదారులకు సామాజిక పింఛన్‌ పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలో ఎంపీడీవో కవిత అధ్యక్షతన జరిగిన పల్లెపండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిగ్రామాన్ని అబివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాన్‌ పల్లెపండుగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గంలో అన్నిచెరువులకు హంద్రీనీవా నీటిని నింపాలన్న సంకల్పంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆయన సంకల్పంతో నాడుచేపట్టిన కార్యక్రమం వల్ల నేడు అన్నిచెరువులకు క్రిష్ణాజలాలు చేరుతున్నాయన్నారు. అంతేకాకుండా ప్రతిగ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోట్లనిధులు ఖర్చుచేసి ఎన్నోగ్రామాలకు తాగునీటికి శాశ్వతపరిష్కారం చూపారన్నారు. ఆయన అడుగుజాడల్లో ముందుకుసాగుతూ నేడు పత్తికొండ నియోజకవర్గంలో అన్నిగ్రామాల పంటపొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నానన్నారు. పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో కాలనీ వెనుకవైపు కాలనీలో పల్లెపండుగ 3.0 కింద నూతన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలలో టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, బత్తిన లోక్‌నాథ్‌, రాజారెడ్డి, బత్తినిరాజశేఖర్‌, బత్తిని కుబేర్‌నాథ్‌, హోటల్‌ శ్రీనివాసులు, మనోహర్‌చౌదరి, బీటీగోవిందు, చక్కాగోపాలయ్య, పత్తిప్రసాద్‌, బాలప్ప ఉన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:25 AM