అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:02 AM
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
చాగలమర్రి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని డి.వనిపెంట గ్రామంలో రూ.11 లక్షలతో చేపట్టిన అభివృద్ధిపనులను ఆమె ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో కొత్తగా రోడ్లు వేసేందుకు రూ.8 లక్షలతో ప్రతిపాదనలు చేస్తున్నామని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో తాహిర్‌హుసేన్, డిప్యూటీ ఎంపీడీవో తారకేశ్వరి, ఏవో రంగనేతాజీ, ఎంఈవో శేషశయనారెడ్డి, ఏఈలు కొండారెడ్డి, రమణయ్య, నవీన్, సింగిల్‌విండో అధ్యక్షుడు ఉసేన్‌రెడ్డి, టీడీపీ నాయకులు నరసింహా రెడ్డి, గోపాల్, లక్ష్మీరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రమణారెడ్డి, గంగయ్య, బాబు నాయుడు, నరసింహులు, దస్తగిరి, సురేష్‌కుమార్‌రెడ్డి, బ్రహ్మం, శ్రీనివాస రెడ్డి, జనార్దన్‌రెడ్డి, విక్రమ్, పీరయ్య, రమణ పాల్గొన్నారు.