సమస్యల పరిష్కారానికే ‘కరెంటోళ్ల జనబాట’
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:37 AM
విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటి కప్పుడు వెంటనే పరిష్కరించేందుకే ప్రతి మంగళ, శుక్రవారంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్నట్లు విద్యుత్‌శాఖ డీఈ విజయరాజు, ఏఈ సుధాకర్‌రావు తెలిపారు.
గోనెగండ్ల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటి కప్పుడు వెంటనే పరిష్కరించేందుకే ప్రతి మంగళ, శుక్రవారంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్నట్లు విద్యుత్‌శాఖ డీఈ విజయరాజు, ఏఈ సుధాకర్‌రావు తెలిపారు. మండలంలోని వేముగోడు గ్రామంలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ అధికారులు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కంచారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రాలయం: మండలంలోని గ్రామాల్లో ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా తమకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తారించి న్యాయం చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ గోవిందు తెలిపారు. శుక్రవారం ‘కరెంటోళ్ల జనబాట’లో భాగంగా రచ్చమర్రి గ్రామంలో సర్పంచ్ మేకల సుజాత ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు ఇంటింటికి తిరిగి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పీఎం సూర్యఘర్ పథకం సోలార్‌పై అవాహన కల్పించారు. లో వోల్టేజ్, శిథిలావస్థకు చేరిన వాద్యుత్ స్థంబాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, చెట్లపై విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పై కరపత్రాలు పంచుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ నర్సప్ప, కర్రెన్న, భీమన్న, వెంకటేష్, దయాకర్, ప్రదీప్, వీరేశ్, రషీద్, చాంద్‌బాషా, రఘు, మంజు, రాజశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.