Share News

విపత్తు సమయంలో సమన్వయం కీలకం: ఏఎస్పీ

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:45 AM

విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఎంతో కీలకమని, రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థమంతమైన కోఆర్డినేషన్‌తో ప్రాణనష్టం తగ్గించవచ్చని ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్‌ పేర్కొన్నారు.

విపత్తు సమయంలో సమన్వయం కీలకం: ఏఎస్పీ
సీపీఆర్‌ విధానం గురించి వివరిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

నంద్యాల, క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఎంతో కీలకమని, రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థమంతమైన కోఆర్డినేషన్‌తో ప్రాణనష్టం తగ్గించవచ్చని ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్‌ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తేనే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోగలమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ (వరదలు)పై శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. నంద్యాల సమీపంలోని చిన్నచెరువు కట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్‌, ఆర్డీవో విశ్వనాథ్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియాంక, ఆర్డీవో శివకుమార్‌రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాలకృష్ణ, ఏఆర్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:45 AM