పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:23 AM
గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ అన్నారు.
వెల్దుర్తి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ అన్నారు. బుధవారం వెల్దుర్తిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ ఉత్సవ్ సేవా సంకల్పం అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. రికార్డులను తనిఖీ చేశారు. పోషణ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో సీడీపీవో లూక్, సూపర్‌వైజర్లు పద్మావతి, సరస్వతమ్మ, శ్రీదేవి, సుగుణమ్మ, సునీత పాల్గొన్నారు.