పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:31 AM
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు.
ఆస్పరి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు. గురువారం ఆస్పరిలో పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధ్యమన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలన విద్శంస పాలన నుంచి కోలుకుంటున్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఊడ్చుతూ ప్రజల అందరికీ పరిసరాల పరిశుభ్రతపై వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆలూరు మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గీతావాణి, మాజీ ఎంపీపీ కృష్ణయాదవ్, మండల కన్వీనర్ గోవిందు, సొసైటీ డైరెక్టర్ సంజన, నౌనేపాటి చౌదరి, సుదర్శన్, వీరేష్, రాఘవేంద్ర, ఈరన్న ఆచారి, శేషిరెడ్డి, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.