Share News

రైతు బాంధవుడు చంద్రబాబు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM

సీఎం చంద్రబాబు రైతు బాంధవుడు అని టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, టీబీపీ ఎల్లెల్సీ చైర్మన్‌ టిప్పుసుల్తాన్‌, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి అన్నారు.

రైతు బాంధవుడు చంద్రబాబు
నీరు విడుదల చేస్తున్న టీడీపీ నాయకులు

పెద్దకడబూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రైతు బాంధవుడు అని టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, టీబీపీ ఎల్లెల్సీ చైర్మన్‌ టిప్పుసుల్తాన్‌, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి అన్నారు. మండలంలోని పులికనుమ ప్రాజెక్టు నుంచి 8 గ్రామాలకు గురువారం సాగునీటిని విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్‌ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నాయకులు కోరిన వెంటనే సాగునీటిని విడుదల చేసేందుకు కృషి చేయడం అభినందనీయ మన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేయడం మహాపాపం అని అన్నారు. స్థానిక దేవాలయం ముందు పసుపు నీటితో శుద్ధి చేశారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ఈరన్న, మండల కన్వీనర్‌ మల్లికార్జున, సొసైటీ చైర్మన్లు ఆంజనేయులు, నరసప్ప, అయ్యన్న, టీడీపీ నాయకులు ఖాజా, మల్లికార్జున, జ్ఞానేష్‌, మురళీకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ తిక్కన్న, నరసన్న, వీరేష్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:06 AM