Share News

మెరుగైన సేవలు అందించాలి: ఆర్టీసీ ఈడీ

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:06 AM

ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్టీపీ రాఘవకుమార్‌ సూచించారు.

 మెరుగైన సేవలు అందించాలి: ఆర్టీసీ ఈడీ
పత్తికొండ డిపోలో మొక్క నాటుతున్న ఈడీ రాఘవకుమార్‌

పత్తికొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్టీపీ రాఘవకుమార్‌ సూచించారు. పత్తికొండ ఆర్టీసీ డిపోను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలోని అన్ని విభాగా లను పరిశీలించారు. డిపో ఆవరణంలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఈడీ మాట్లాడుతూ బస్సుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. అనంతరం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన పరిశీలించారు. కర్నూలు డీపీటీవో శ్రీనివాసులు, ఇన్‌చార్జి డీఎం నాగభూపాల్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌ఎస్‌ రెడ్డి, జీఎస్‌ వాసు, ఈవీఎం రాజు, లక్ష్మన్న, ఎం.జయన్న ఉన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:06 AM