Share News

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:33 AM

ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు సురేష్‌ కుమార్‌ అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు
పాఠశాలను తనిఖీ చేస్తున్న పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకుడు

ఆదోని అగ్రికల్చర్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పీఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు సురేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌ఆర్‌లేబర్‌ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల హెచ్‌ఎం కే రవిని పీఎం శ్రీ నిధులు వినియోగం సమకూర్చిన వసతులపై ఆరా తీశారు. ఆయన వెంట ఏఎంవో రఫీక్‌, మండల విద్యాశాఖ అధికారి ఇంద్రావతి, ఉపాధ్యాయుడు వీరచంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.

=

Updated Date - Jun 09 , 2026 | 12:33 AM