Share News

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:26 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు
భవనాన్ని ప్రారంభిస్తున్న పీఠాధిపతి, అధికారులు

మంత్రాలయం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అన్నారు. శుక్రవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో రూ. 60లక్షలు ఖర్చుతో కవీంద్ర నిలయం డార్మిటరీ భవనాన్ని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు పూజలు, రిబ్బన్‌ కట్‌ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కింద నిర్మించిన భవనంపై మరో అంతస్తుల్లో అదనంగా 100 మంది భక్తులు నిద్రించేందుకు అన్ని రకాల వసతులతో నిర్మించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ మరో 200గదులను భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్‌కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఏఈ బద్రీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:26 AM