రమణీయం.. ప్రహ్లాదరాయల వెండి రథోత్సవం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:01 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై విహరించారు.
మంత్రాలయం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై విహరించారు. శనివారం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేతులమీదుగా పూర్ణభోధపూజ మందిరంలో ఉత్సవమూర్తికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములకు పీఠాధిపతి బంగారు నాణేలతో అభిషేకం చేశారు. అనంతరం వెండి రథంను వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాద రాయలను అధిష్టించి పీఠాధిపతి మహా మంగళ హారతులు ఇచ్చి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. రెండో శనివారం సెలవు దినం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు.