రమణీయం.. లక్ష్మమ్మవ్వ రథోత్సవం
ABN , Publish Date - May 08 , 2026 | 12:11 AM
ఆదోని లక్ష్మమ్మవ్వ జన్మస్థలమైన ఆలూరు మండలం మూసనహళ్లి గ్రామంలో లక్ష్మమ్మవ్వ రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.
ఆలూరు రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని లక్ష్మమ్మవ్వ జన్మస్థలమైన ఆలూరు మండలం మూసనహళ్లి గ్రామంలో లక్ష్మమ్మవ్వ రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఉదయం లక్ష్మమ్మవ్వ దేవాలయంలో గంగపూజ, పుష్పాలంకరణ, మహా మంగళ మారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం భక్తజన సంద్రం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ మన్మథవిజయ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాచోటి సుబ్బయ్య, మాజీ సర్పంచులు పార్వతి, సోమలింగ, ఎంబీ సోమశేఖర్, టీడీపీ నాయకుడు హులేబీడు లక్ష్మన్న, డీలర్ నారాయణ, పాటిల్ శేషాద్రిరెడ్డి, రామలింగారెడ్డి, మారేగౌడ్, రామన్న తదితరులు పాల్గొన్నారు.