Share News

ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:24 AM

పత్తికొండ పట్టణంలో శుక్రవారం స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించగా.. న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.

ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు
పత్తికొండలో ఓటుహక్కును వినియోగించుకుంటున్న తుగ్గలి నాగేంద్ర దంపతులు

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ పట్టణంలో శుక్రవారం స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించగా.. న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు. పట్టణంలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మధుబాబు వ్యవహరించారు. పత్తికొండ బార్‌ అసోసియేషన్‌లో మొత్తం 106 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, అందులో 100 మంది దాకా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, ఆయన సతీమణి మాజీ జడ్పీటీసీ వరలక్ష్మి, టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకుడు తిమ్మయ్య చౌదరి, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఆదోని: బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. న్యాయవాదులు ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఆదోని బార్‌ అధ్యక్షుడు వి.శ్రీరాములు ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించి పర్యవేక్షించారు. ఆయనతో పాటు బార్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌కే జీవన్‌ సింగ్‌, ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు ఎన్నికల సహకారులుగా వ్యవరించారు. మొత్తం ఓటర్లు 298 కాగా.. పోలైన ఓట్లు 262 పోలింగ్‌ శాతం 87 శాతం అయ్యింది.

Updated Date - Feb 14 , 2026 | 12:24 AM