ఫ్లోరోసిస్ నివారణపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - May 14 , 2026 | 12:04 AM
ఫ్లోరోసిస్ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ సూచించారు.
కర్నూలు హాస్పిటల్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఫ్లోరోసిస్ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ సూచించారు. నగర శివారులోని టీవీ-9 కాలనీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో సంచార చికిత్సలో భాగంగా ఫ్లోరోసిస్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కలిగిన ఆహార పదార్థాలు మంచినీరు తీసుకోవడం వలన వ్యాధికి గురవుతున్నారు. దీని వల్ల వికారం, వాంతులు, ఆకలి మందగించడం, దంతాలు రంగుమారడం తరుచూ మూత్రం రావడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు వస్తాయన్నారు. పొగాకు ఉత్పత్తులైన బీడి, చుట్ట, సిగరెట్, జర్దా, తంబాకు, గుట్కా వంటివి ఉపయోగించే వారిపై ఫ్లోరోసిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫ్లోరోసిస్ బాధితులు తాజా ఆకుకూరలు, పాల పదార్థాలు, పండ్లు, విటమిన్-సి ఉన్న ద్రాక్ష, ఉసిరి, నిమ్మకాయలు తప్పక తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోస్టరును ఆవిష్కరించారు. వైద్యాధికారి డా.నందిని, క్షేత్ర స్థాయి పర్యవేక్షకులు ఎస్తేర్ రాణి, సామాజిక ఆరోగ్య అధికారులు, అనిత, మహేశ్వరి, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.