ఏపీఆర్‌ఎస్‌ఏ కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:49 PM
ఏపీఆర్‌ఎస్‌ఏ కర్నూలు డివిజన్ నూతన కమిటీ ఆదివారం ఎన్నికైంది. ఆర్డీవో కార్యాలయంలోని ఏపీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహిం చారు.
కర్నూలు కలెక్టరేట్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఏపీఆర్‌ఎస్‌ఏ కర్నూలు డివిజన్ నూతన కమిటీ ఆదివారం ఎన్నికైంది. ఆర్డీవో కార్యాలయంలోని ఏపీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహిం చారు. ఏపీఆర్‌ఎస్‌ఏ కర్నూలు డివిజన్ అధ్యక్షుడిగా ధనుంజయరెడ్డి, కార్యదర్శిగా గురుస్వామి, ట్రెజరర్‌గా సందీప్ నాయక్ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా కోడు మూరు తహసీల్దార్ నాగరాజు, వెల్దుర్తి తహసీల్దార్ వర్మ, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్‌బాబు హాజరయ్యారు. నూతన ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీఆర్‌ఎస్‌ఏ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సహేరాబాను, వెంకట్‌రాజు, లోకేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.