ప్రభుత్వ నిర్ణయంపై ఏపీఎన్జీవోస్ హర్షం
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:25 AM
2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్ వెలువడి ఉద్యోగాల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి పెన్షన్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్ వెలువడి ఉద్యోగాల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి పెన్షన్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. అలాగే ఎయిడెడ్ కళాశాలలు, గురుకులాలు తదితర శాఖల సిబ్బందికి 62 ఏళ్ల సర్వీసు పొడగింపు ఉత్తర్వులు సాధించడం ఉద్యోగుల చరిత్రలో కీలక ఘట్టమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు జిల్లాశాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి. జవహర్‌లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ కాశన్న, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.