వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:49 PM
మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.
దేవనకొండ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి, ఉదయం ఆంజనేయ స్మరణతో ప్రభను గ్రామస్థులు ముందుకు లాగారు. సాయంత్రం ఆలయ పరిసర ప్రాంతంలో కుందేళ్ల పారువేట, గుర్రం సేవా కార్యక్రమం నిర్వహించారు.