సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:03 AM
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు.
కర్నూలు రూరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు. మండలంలోని గార్గేయపురం గ్రామంలో దివంగత నాయకుడు డి.రాజావర్ధన్‌రెడ్డి జ్ఞాపకార్థం డేనియల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన, కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు. రక్తదానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు. కంటి సంబందించిన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం అవసరమని అన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామంలో అనేక మంది ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన వారికి కంటి అద్దాలు, శస్త్రచికిత్స కోసం వైద్యులు పలు సూచనలు అందించారని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, సీతారామిరెడ్డి, ఎం.రామోజీరావు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.