ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:39 PM
దోనిని జిల్లాగా కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 43వ రోజుకు చేరుకున్నాయి.
ఎమ్మిగనూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఆదోనిని జిల్లాగా కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 43వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ప్రజా సంఘాల నాయకులు నీలకంఠ, రామలింగడు, బతకయ్య, యోహానులు పాల్గొన్నారు. నాయకులు గణేశ్, శేఖర్, బాలరాజు మాట్లాడుతూ ఆదోనిని జిల్లా చేయాలని డివిజన్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయం మేరకు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ రెడ్డి, బాబు, ఖాజా, రఘులు పాల్గొన్నారు.
ఆదోనిని జిల్లా చేయాలని కోరుతూ జేఏసీ ఆద్వర్యంలో ఈనెల 24న తలపెట్టిన ఆదోని డివిజన్ బంద్‌ను జయప్రదం చేయాలని నాయకులు దస్తగిరి నాయుడు, కుంకనూరు వీరేశ్ రాజు, ఉదయ్, సీపీఐ నాయకులు రంగన్న, తిమ్మగురుడు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎన్జీవో కార్యాలయంలో జేఏసీ నాయకుల సమావేశం నిర్వహించారు.