పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - May 14 , 2026 | 12:06 AM
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్‌పీవో లక్ష్మి హెచ్చరించారు.
సి. బెళగల్, మే 13 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్‌పీవో లక్ష్మి హెచ్చరించారు. మండలంలోని పోలకల్లు గ్రామంలో బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమాన్ని పరిశీలించారు. డీఎల్‌పీవో మాట్లాడుతూ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య తలెత్తకుండ చూడాలన్నారు. తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, కొళాయిల దగ్గర మురుగు నిల్వ లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీల్లో తాగునీటి పైపులైన్లు ఉన్న వాటిని తరుచూ పరిశీలించాలని, లీకేజీలు ఉన్న పైపులైన్లు తక్షణమే తొలగించాలని సూచించారు. ఎంపీడీవో రాణెమ్మ, పంచాయతీ కార్యదర్శులు సునీల్‌రాణి, నాగమణి, సిబ్బంది ఉన్నారు.