చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:11 AM
ఆరేకల్లు గ్రామానికి చెందిన తలారి ఎ.హుసేనిపై అదే గ్రామానికి చెందిన నరసప్ప దాడి చేశాడని, చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏ సంఘం నాయకులు కృష్ణ, వీరేశ్, వీఆర్‌ఏలు కోరారు.
ఆదోని రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆరేకల్లు గ్రామానికి చెందిన తలారి ఎ.హుసేనిపై అదే గ్రామానికి చెందిన నరసప్ప దాడి చేశాడని, చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏ సంఘం నాయకులు కృష్ణ, వీరేశ్, వీఆర్‌ఏలు కోరారు. నరసప్ప సీసీ రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్నాడని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఇంటిని ఫొటో తీస్తుండగా దాడి చేశాడని తెలిపారు. జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్, సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న వీఆర్‌ఏపై దాడి చేయడం దారుణమన్నారు.