Share News

రీసర్వే వేగవంతం చేయండి: సబ్‌ కలెక్టర్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:18 AM

రీసర్వేను వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ మనీషా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

రీసర్వే వేగవంతం చేయండి: సబ్‌ కలెక్టర్‌
రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మనీషా

గడివేముల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రీసర్వేను వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ మనీషా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గడివేముల తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందితో సమావేశమై రీసర్వే పనులపై ఆరా తీశారు. మ్యూటేషన్‌ సమయంలో రైతు అడ్రస్‌ను సేకరించాలన్నారు. మ్యూటేషన్‌ అనంతరం అడంగల్‌ వారి ఇంటికే రిజిస్ట్రర్‌ పోస్ట్‌ ద్వారా వెళ్తుందన్నారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్‌ హరికృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:18 AM