కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం
ABN , Publish Date - May 22 , 2026 | 12:16 AM
నంద్యాల రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న అభివ్బద్ధి పనులపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డులలో చేపట్టాల్సిన పనుల గురించి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించారు.
అధికారులతో సమీక్ష
పట్టణంలోని బొమ్మలసత్రం, గాంధీనగర్‌లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణంపై అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష నిర్వహించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ సమీక్ష నిర్వహించారు. రైల్వేగేట్ల వద్ద ట్రాపిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు. స్నేహ వ్బద్ధాశ్రమం, గాంధీనగర్ సమీపంలోని రైల్వేగేట్ల వద్ద అండర్‌పాస్ నిర్మించాలా?, ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలా? అనే అంశంపై చర్చించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేయాలని సూచించారు.