Share News

సర్వీసు రోడ్డు వేయాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:16 AM

కర్నూలు-పెద్దపాడు రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు, సర్వీసు రోడ్డు వేసి ప్రమాదాలను అరికట్టాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

 సర్వీసు రోడ్డు వేయాలి
పెద్దపాడు రోడ్డుపై నిరసన తెలుపుతున్న పీపీఎస్‌ఎస్‌ సభ్యులు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కర్నూలు-పెద్దపాడు రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు, సర్వీసు రోడ్డు వేసి ప్రమాదాలను అరికట్టాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం పెద్దపాడు సమీపంలోని రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. పుల్లారెడ్డి మాట్లాడుతూ కర్నూలు- పెద్దపాడు మధ్య రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తతో పాటు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అయితే చైత్ర (2) అనే చిన్నారి మరణించిన విషయం తెలియక తమ కూతురు బ్రతికే ఉందని తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ఉన్న తల్లితండ్రులు భరించలేకపోయారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రూ.13 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారులు ఒక్క స్పీడ్‌ బ్రేకర్‌, లైట్లు కూడ వేయలేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి పెద్దపాడు రోడ్లు స్పీడ్‌ బ్రేకర్లు, లైట్లు, సర్వీసు రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు దివాకర్‌, ఆంజనేయులు, నాగేశ్వరుడు, ఇలియాస్‌, రహిమాన్‌, చంద్ర, రమణగౌడు, సీవి.వర్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:16 AM