ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:35 PM
పత్తికొండ పట్టణంలో శనివారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ పట్టణంలో శనివారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్‌ను పురస్కరించుకుని అంబేడ్కర్ సర్కిల్ నుంచి మార్కెట్‌యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు చందోలి తిరుపాల్, దైవసేవకులు ఆర్‌సీఎం చర్చి ఫాదర్ చౌరప్ప, ఏసుదాసు, ఆనంద్, రన్ ఫర్ జీసస్ సభ్యులు పాల్గొన్నారు.