చెప్పాం... చేస్తున్నాం.. ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాం
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:26 AM
కర్నూలులో ఎస్‌ఏఈఎల్ సంస్థకు చెందిన 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ప్రారంభంపై సీఎం
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఎస్‌ఏఈఎల్ సంస్థకు చెందిన 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. ‘కర్నూలు జిల్లాలో 2400 ఎకరాల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. ఈ ప్లాంట్ ద్వారా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గ్రీన్ ఎనర్జీ సరఫరా కానుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ కీలక శక్తిగా అవతరిస్తుందనడానికి ఎస్‌ఏఈఎల్ సోలార్ ప్లాంట్ ప్రత్యక్ష నిదర్శనం. చెప్పాం... చేస్తున్నాం... ఇచ్చిన మాట ప్రకారమే ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు