కేఎస్‌టీడీసీ చేతికి తిరుమల కర్ణాటక సత్రం
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:28 AM
తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ భాధ్యతలను ఇకపై కర్ణాటక ప్రభుత్వ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(కేఎస్‌టీడీసీ) చేపట్టనుంది. శ్రీవారి ఆలయ వెనుక భాగంలోని విశాల ప్రదేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలతో గదులను నిర్మించిన విషయం తెలిసిందే.
తిరుమల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ భాధ్యతలను ఇకపై కర్ణాటక ప్రభుత్వ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(కేఎస్‌టీడీసీ) చేపట్టనుంది. శ్రీవారి ఆలయ వెనుక భాగంలోని విశాల ప్రదేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలతో గదులను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సత్రాల మెరుగైన నిర్వహణ కోసం కర్ణాటక దేవదాయ శాఖ నుంచి టూరిజం విభాగానికి అప్పగిస్తూ ఇటీవల ఆ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈక్రమంలో కేఎస్‌టీడీసీ ఎండీ శివప్రసాద్ గురువారం తిరుమల చేరుకుని సత్రాల నిర్వహణ బాధ్యతలను ఎండోమెంట్ విభాగం నుంచి తీసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రవాసీసౌధ(కర్ణాటక సత్రం)లో క్లీనింగ్, నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించారని తెలిపారు. స్టార్ హోటల్ తరహాలో నిర్వహించేందుకు ముజరాయి కమిషనర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. దశలవారీగా సిబ్బందిని నియమించడంతో పాటు వీలైనంత తర్వలో దీని నిర్వహణ బాధ్యతలను చేపడతామన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే టీటీడీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇది ప్రభుత్వ విభాగాల మధ్య జరిగిన ఒప్పందమేని, ఇందులో ఎలాంటి ప్రైవేట్ సంస్థలు లేవని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు