వీఆర్వోల సంఘం అధ్యక్షుడిగా కోన ఆంజనేయకుమార్
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:14 AM
ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కోన ఆంజనేయకుమార్...
విజయవాడ అర్బన్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కోన ఆంజనేయకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎం.బాపూజీ, సహధ్యక్షుడుగా టి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలుగా జి.అనుపమ, ప్రచార కార్యదర్శిగా జి.ధిలేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.సాహితి ఎన్నికయ్యారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు