బీసీలకు జగన్ ద్రోహం: మంత్రి కొల్లు
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:50 AM
బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు జగన్ 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి పాలనలో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబు బీసీలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు జగన్ 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి పాలనలో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబు బీసీలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను కుదించిన జగన్ వారికి ద్రోహం చేశారని, 16,800 మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే గొడ్డలి పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..