మహాచండీగా కనకదుర్గమ్మ దర్శనం
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:22 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బుధవారం మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజామున ..
విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బుధవారం మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి బారులు తీరారు. సాయంత్రం 6 గంటల సమయానికి 80 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాకతో ప్రొటోకాలు దర్శనాలు నిలుపుదల చేశారు. దీంతో సామాన్యులకు దర్శనంగా త్వరగా పూర్తయింది. కుంకుమార్చనల్లో ఉభయదాతలు పాల్గొనగా, చండీహోమాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం కనకదుర్గానగర్లో ఆది దంపతుల నగరోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల నడుమ గంగా సమేత దుర్గామల్లేశ్వరులు అర్జునవీధిలో ఊరేగారు. కళాకారులు తమ కళా ప్రదర్శనలతో దుర్గమ్మకు నీరాజనాలు అర్పించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..