Share News

దుర్గమ్మ దివ్య దర్శన్‌ టికెట్ల విడుదల

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:44 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసులు లేకుండా నేరుగా అమ్మవారిని దర్శించుకునేందుకు...

దుర్గమ్మ దివ్య దర్శన్‌ టికెట్ల విడుదల

  • ధర రూ.1,000... దేవస్థానం బస్సులో కొండపైకి

  • ప్రత్యేక క్యూలో అమ్మవారి ముఖ మండప దర్శనం

  • ‘మన మిత్ర‘ వాట్సాప్‌ ద్వారా 11, 12, 13 తేదీలకు టికెట్లు

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసులు లేకుండా నేరుగా అమ్మవారిని దర్శించుకునేందుకు జగన్మాత దివ్య దర్శన్‌ ప్రత్యేక టికెట్ల కోటాను ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దసరా ఉత్సవాల తొలి మూడు రోజులైన 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక ’మన మిత్ర‘ వాట్సాప్‌ గవర్నెన్స్‌ (9552300009) ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు.

టికెట్‌ ధర రూ.1,000గా నిర్ణయించారు. ’మన మిత్ర‘ వాట్సాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకెళతారు. ఓం టర్నింగ్‌ వద్ద గల ప్రత్యేక క్యూ ద్వారా అనుమతించి, ముఖ మండపం (బంగారు వాకిలి) నుంచి కనకదుర్గమ్మను అత్యంత సమీపంగా దర్శించుకునే భాగ్యం కల్పిస్తారు. సామాన్య భక్తులు ముందస్తుగా టికెట్లు నమోదు చేసుకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా నిర్దేశిత సమయంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో కోరారు. రూ.500, రూ.300, రూ.100ల టిక్కెట్లు రద్దు చేసి ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు 4 క్యూల ద్వారా అందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:44 AM