Share News

మహా సమాధికి కల్కి భగవాన్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:16 AM

ఆధ్యాత్మిక గురువు, ఏకం క్షేత్రం వ్యవస్థాపకుడు కల్కి భగవాన్‌ అలియాస్‌ విజయకుమార్‌ నాయుడు మహా సమాధికి చేరారు. గత నెల 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మహా సమాధికి కల్కి భగవాన్‌

  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

సత్యవేడు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక గురువు, ఏకం క్షేత్రం వ్యవస్థాపకుడు కల్కి భగవాన్‌ అలియాస్‌ విజయకుమార్‌ నాయుడు మహా సమాధికి చేరారు. గత నెల 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన పార్ధివదేహాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో భక్తుల దర్శనార్థం మూడు రోజుల పాటు ఉంచారు. శుక్రవారం కల్కి భగవాన్‌ భౌతికాయానికి కుమారుడు కృష్ణాజీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. వేలాది భక్తుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర సాగింది. కుమారుడు కృష్ణాజీ, కోడలు ప్రీత, మనవరాలు లోక వాహనం ముందు నడుచుకుంటూ వెళ్లారు. కల్కి భగవాన్‌ ఇంటి సమీపంలోని ఉద్యానవనానికి పార్ధివదేహాన్ని చేర్చి హిందూ సంప్రదాయంలో మహా సమాధి చేశారు. కల్కి భగవాన్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు ఆదిమూలం, విజయశ్రీ, సునీల్‌కుమార్‌, రామకృష్ణ, ఎమ్మెల్సీ కల్యాణ్‌ చక్రవర్తి, సినీ నటి నిత్యామీనన్‌ భగవాన్‌కు నివాళులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:16 AM