Share News

మోపెడ్‌ను తప్పించబోయి..!

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:09 AM

మోపెడ్‌ నడుపుతున్న వ్యక్తి కారణంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌.రాగంపేట శివారులోని ఆదిత్య ఆస్పత్రి వద్ద హైవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

మోపెడ్‌ను తప్పించబోయి..!

  • ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. మహిళ మృతి

  • ఐదుగురికి తీవ్ర గాయాలు.. కాకినాడ జిల్లాలో ఘటన

గండేపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మోపెడ్‌ నడుపుతున్న వ్యక్తి కారణంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్‌.రాగంపేట శివారులోని ఆదిత్య ఆస్పత్రి వద్ద హైవేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలివీ.. జెడ్‌.రాగంపేట ఆదిత్య ఆస్పత్రి ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డులో నుంచి ఓ వ్యక్తి మోపెడ్‌పై నేరుగా హైవేపైకి వచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో విజయవాడ వైపు నుంచి అతివేగంగా వస్తున్న నెక్సాన్‌ కారు అతడిని తప్పించబోయి, అటు విశాఖ వైపు నుంచి వస్తున్న ఎర్టిగా కారును రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నెక్సాన్‌ కారులో ప్రయాణిస్తున్న వడ్డి సరస్వతమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని పి.ప్రదీప్‌కుమార్‌, అనిత దంపతులు స్వల్పంగా గాయపడగా.. వారి కుమారుడు రోహన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలవ్వగా కాకినాడ జీజీహెచ్‌కు తరలించినట్లు గండేపల్లి ఎస్‌ఐ యూవీ శివనాగబాబు తెలిపారు.

Updated Date - Nov 22 , 2026 | 07:10 AM