కువైత్ క్రికెట్ జట్టులో కడప కుర్రోడు
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:18 AM
కువైత్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన కడప జిల్లా రాజంపేట మండలం కుప్పవారిపల్లికి చెందిన నెట్టెం విశ్వతేజకు ఏపీఎన్నార్టీ-కువైత్ శాఖ అభినందనలు తెలిపింది.
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కువైత్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన కడప జిల్లా రాజంపేట మండలం కుప్పవారిపల్లికి చెందిన నెట్టెం విశ్వతేజకు ఏపీఎన్నార్టీ-కువైత్ శాఖ అభినందనలు తెలిపింది. విశ్వతేజ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏపీఎన్నార్టీ-కువైత్ శాఖ సభ్యులు ఓలేటి దివాకర్ నాయుడు, రాచూరి రెడ్డి మోహన్ తదితరులు ఆకాంక్షించారు.