డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించండి
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:23 AM
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకున్నా టీచర్ పోస్టులు ఇచ్చేశారని తెలిపారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరిన జగన్
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకున్నా టీచర్ పోస్టులు ఇచ్చేశారని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, యువగళం నేతల పేరిట తమ శ్రేణులపై దాడులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం లోక్‌భవన్ ఎదుట జగన్ మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే టీచర్లు కాని టీచర్లతో చంద్రబాబు కొట్టించారన్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్నారు.