Share News

జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:21 PM

జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. జడా శ్రవణ్ కుమార్‌ ఆదాయపన్ను ఎగవేశారంటూ కారంపూడి జానకి సుమంత్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు.

జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు
Jada Sravan Kumar

ఇంటర్‌నెట్ డెస్క్: జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. జడా శ్రవణ్ కుమార్‌ ఆదాయపన్ను ఎగవేశారంటూ కారంపూడి జానకి సుమంత్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. జడా శ్రవణ్ కుమార్‌పై బినామీ ఆస్తుల చట్టంతో పాటు ఆదాయపన్ను చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని సుమంత్ తన ఫిర్యాదులో కోరారు.


కాగా, మత విద్వేషాలు, వైషమ్యాలు రగిలిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు కొద్దిరోజుల క్రితం జై భీమ్‌ భారత్‌పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌తోపాటు మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్‌, కాళ్ల పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషించి హేళన చేశారని ఏలూరు గొల్లాయిగూడానికి చెందిన పెద్దాడ వెంకటరమణ, కాళ్ల మండలం సీసలికి చెందిన తోట ఫణిబాబు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, పాలకోడేరు పోలీసు స్టేషన్లలోనూ శ్రవణ్‌ కుమార్‌పై ఫిర్యాదులందాయి.


ఇవి కూడా చదవండి

నిరంజన్ మృతి కలచివేసింది: పవన్ కల్యాణ్

ఆయన జీవితం నిరాడంబరం..

Updated Date - Jul 08 , 2026 | 12:51 PM