Share News

పీఎస్ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:33 AM

గతంలో నిర్వహించిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో తలెత్తిన లోపాను సరిదిద్దే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో పీఎస్ఎల్వీ రాకెట్‌ మూడో దశకు శక్తినిచ్చే...

పీఎస్ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం

శ్రీహరికోట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గతంలో నిర్వహించిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో తలెత్తిన లోపాను సరిదిద్దే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో పీఎస్ఎల్వీ రాకెట్‌ మూడో దశకు శక్తినిచ్చే ఘన మోటార్‌ హెచ్‌పీఎస్3కి గ్రౌండ్‌ స్టాటిక్‌ పరీక్షను గురువారం వి జయవంతంగా నిర్వహించింది. గతంలో పీఎస్ఎల్‌వీ-61, పీఎస్ఎల్‌వీ-62 రాకెట్‌లను ప్రయోగించిన సమయంలో మూడో దశలో కొన్ని లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీంతో మూడో దశ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నాజిల్‌ డిజైన్‌, మెకానికల్‌ ఇంటర్‌ఫేసులను బలోపేతం చేశారు. సీలింగ్‌ వ్యవస్థల్లో అదనపు భద్రతతోపాటు నాణ్యత తనిఖీలను మరింత కఠినతరం చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్ష ద్వారా సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించనున్నారు. ఈ సమీక్ష ఆధారంగా రాబోయే పీఎస్ఎల్వీ ప్రయోగాలకు ముందు మరిన్ని ధ్రువీకరణ పరీక్షలు చేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 01:34 AM