స్టాక్ మార్కెట్లో లాభాల పేరిట దోపిడీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:42 AM
స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి తిరిగి ఆ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసగాళ్లు అతని ఖాతా మొత్తం ఖాళీ చేశారు. పెట్టుబడి పెట్టించిన ఆన్లైన్ బ్రోకర్లను సంప్రదించడానికి బాధితుడు ప్రయత్నిస్తే వాళ్లు స్పందించలేదు.
1.97 కోట్లపైగా పెట్టుబడి పెట్టించిన మోసగాళ్లు
తర్వాత ఖాతా మొత్తం ఖాళీ చేసిన వైనం
సాన్వి వాధ్వా, భూమిక ఢోలా వాట్సాప్ గ్రూపుల ద్వారా మోసపోయిన బాధితుడు
అద్దంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
అద్దంకి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి తిరిగి ఆ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసగాళ్లు అతని ఖాతా మొత్తం ఖాళీ చేశారు. పెట్టుబడి పెట్టించిన ఆన్లైన్ బ్రోకర్లను సంప్రదించడానికి బాధితుడు ప్రయత్నిస్తే వాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. అద్దంకి సీఐ సుబ్బరాజు కథనం మేరకు.. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని కొత్త దామావారిపాలెంకు చెందిన పర్చూరి సురేశ్బాబు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఈ క్రమంలో అతనికి సాన్వి వాధ్వా, భూమిక ఢోలా నుంచి వాట్సాప్ మేసేజులు వచ్చాయి. వీటికి స్పందించడంతో వారు పలు గ్రూపుల్లో చేర్చారు. సామ్కో సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థ పేరు చెప్పి..
తాము చెప్పిన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 24 మధ్య సురేశ్బాబుతో రూ.1,97,60,870 పెట్టుబడి పెట్టించారు. తన డబ్బు విత్డ్రా చేసుకోవడానికి సురేశ్ బాబు ప్రయత్నించగా మరికొంత డబ్బులు చెల్లించాలన్నారు. ఆ తర్వాత స్పందించటం మానేశారు. తన ఖాతా ఖాళీగా ఉండటాన్ని గుర్తించిన సురే్షబాబు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..