Share News

జనసేనలోకి బైరా దిలీప్‌ చక్రవర్తి

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:55 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్‌ అధినేత బైరా దిలీప్‌ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

జనసేనలోకి బైరా దిలీప్‌ చక్రవర్తి

  • అధినేత పవన్‌ సమక్షంలో చేరిన పారిశ్రామికవేత్త

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్‌ అధినేత బైరా దిలీప్‌ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పవన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన బైరా దిలీప్‌ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాజాగా జనసేన పార్టీలో చేశారు. కాగా, వైసీపీ నేత, శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోలా జగన్‌, తిరుపతికి చెందిన పెనుమాదు ప్రణీత్‌, ఆచంటకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు తుంగ నాగేశ్వరరావు, ఏడీఎస్‌ ప్రసాద్‌, మారుతి, దోవరీ అమర్నాత్‌ను పవన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 04:55 AM