ఇంద్రకీలాద్రి కిటకిట
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:52 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు జరుగుతున్న సమయంలో ఇంత పెద్దఎత్తున భక్తజనం రావడం చాలా అరుదు.
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
క్యూలైన్లలో వేచి ఉండలేక సొమ్మసిల్లిన భక్తులు
సేవలు అందించిన వైద్యులు, ఆలయ సిబ్బంది
ఇంద్రకీలాద్రి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు జరుగుతున్న సమయంలో ఇంత పెద్దఎత్తున భక్తజనం రావడం చాలా అరుదు. శుక్రవారం గాంధీ జయంతి సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు. అర్చన, హోమాలు చేసే ప్రదేశాలన్నీ కిక్కిరిశాయి. కొందరు భక్తులు ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా నేరుగా అమ్మవారి దర్శనానికి వస్తారు. క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడంతో వారిలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం తెలుసుకున్న ఆలయ ఉద్యోగులు భక్తుల వెంట వచ్చినవారి సహాయంతో వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది సేవలతో వారు కోలుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు