Share News

నేడు ‘ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌’ జలప్రవేశం

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:02 AM

భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి స్వదేశీ ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-1 (ఎఫ్‌ఎ్‌సఎస్‌-1) మంగళవారం జలప్రవేశం చేయనుంది. నేవీ కోసం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌సఎల్‌) నిర్మించిన ఈ సహాయక యుద్ధ నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖపట్నంలో జలప్రవేశం చేయించనున్నారు.

నేడు ‘ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌’ జలప్రవేశం

  • విశాఖ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి స్వదేశీ ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-1 (ఎఫ్‌ఎ్‌సఎస్‌-1) మంగళవారం జలప్రవేశం చేయనుంది. నేవీ కోసం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌సఎల్‌) నిర్మించిన ఈ సహాయక యుద్ధ నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖపట్నంలో జలప్రవేశం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సోమవారం సాయంత్రమే నగరానికి చేరుకున్నారు. ఆయనకు నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్‌ డేగాలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి స్వాగతం పలికారు. ఫ్లీట్‌ సపోర్ట్‌ వెసెల్‌-1 కోసం స్టీల్‌ కటింగ్‌ చేసిన 18 నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసుకొని జలప్రవేశానికి సిద్ధం కావడం విశేషం. ఎఫ్‌ఎస్ఎస్‌-1 బరువు 43,500 టన్నులు. ఇది సముద్రంలోకి వెళ్లిన యుద్ధనౌకలు తిరిగి పోర్టు వరకూ రాకుండానే వాటికి అవసరమైన ఇంధనం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:02 AM