Share News

‘తూర్పు’లో వైసీపీకి జెల్ల!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:26 AM

కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత వైసీపీలోకి వెళ్లిన ఓ నాయకుడు.. వైసీపీ తీరుతో విసిగిపోయి సరైన సమయంలో జెల్ల కొట్టాడు.

‘తూర్పు’లో వైసీపీకి జెల్ల!

  • బీఫాం తీసుకోని అభ్యర్థి.. స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవం

రాజమహేంద్రవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత వైసీపీలోకి వెళ్లిన ఓ నాయకుడు.. వైసీపీ తీరుతో విసిగిపోయి సరైన సమయంలో జెల్ల కొట్టాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరానికి చెందిన ఆదాడి చిన సత్యనారాయణ సుమారు 30 ఏళ్ల నుంచీ కాంగ్రెస్‌, వైసీపీలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రామవరం 2 స్థానం నుంచి వైసీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దిగడానికి నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఉపసంహరణ చివరి రోజైన శుక్రవారం కూడా ఆయన బీఫారం సమర్పించలేదు. వైసీపీ బీఫారం పంపినా ఆయన తిరస్కరించారు. దీంతో చిన్న సత్యనారాయణను స్వతంత్ర అభ్యర్థిగా అధికారులు ప్రకటించారు. అక్కడ వేరే అభ్యర్థులెవ్వరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఆ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే అంశంపై చర్చ జోరందుకొంది.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 05:26 AM