Share News

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:21 AM

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ

  • తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వద్దు

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వివిధ వర్చువల్‌ కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాల కోసం ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వద్దని చెప్పారు. రాయలసీమలో రెండు మున్సిపాలిటీల్లో కొద్దిపాటి సమస్య ఉందని, దాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:21 AM