ఆదిత్యునికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:00 AM
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడి అపురూప కానుక
అరసవల్లి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు. రాగి మకర తోరణం.. వెండి కిరీటం, కవచం, కేయూరాలు, వాణీ చెంగులు, స్వామివారి పాదాలు, సనకృసనందన కవచాలు, మాథర, పింగళ కవచాలు, అశ్వపీఠంతోపాటు ఉషా, ఛాయా, పద్మినీ అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కవచాలు, హస్తాలు తదితర ఆభరణాలకు బంగారు తాపడం చేయించి స్వామివారికి సమర్పించారు. మంగళవారం ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ఈ ఆభరణాలతో అలంకరించారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!