Share News

ఏపీ సమాచార కమిషన్ సంచలన తీర్పు.. ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

ABN , Publish Date - May 22 , 2026 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని దేవాలయాలు, వఖ్ఫ్ సంస్థలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలు సమాచార హక్కు (RTI) చట్టం-2005 పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీ సమాచార కమిషన్ సంచలన తీర్పు.. ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..
Andhra Pradesh RTI news

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని దేవాలయాలు, వఖ్ఫ్ సంస్థలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలు సమాచార హక్కు (RTI) చట్టం-2005 పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ, ఆర్థిక సహాయం పొందుతున్న ఈ సంస్థలు చట్టప్రకారం కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందించడానికి కట్టుబడి ఉండాలని కమిషన్ అంది. ఈ మేరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.


కాగా, విశాఖపట్నంకు చెందిన సమాజసేవకుడు కె.ఎస్.ఎన్. పట్నాయక్ బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి 2012లో నిర్వహించిన ఉత్సవాల వివరాలను కోరుతూ ఆర్‌టీఐ చట్టం కింద దరఖాస్తు చేశాడు. దేవాలయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ ఆలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) సమాచారం ఇచ్చేందుకు నిరాకరించాడు. దీనిపై రాష్ట్ర సమాచార కమిషన్‌ను పట్నాయక్ తాజాగా విచారణ జరిపారు. విచారణ అనంతరం తీర్పును వెలువరించారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: విజృంభించిన హైదరాబాద్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..

Updated Date - May 22 , 2026 | 09:45 PM